సోమవారం (జనవరి 22) రామ్ లల్లా విగ్రహం గ్రాండ్ ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ (ప్రతిష్ఠాపన) వేడుక మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకకు సంబంధించిన శుభ ముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే ఉండటంతో.. ‘అభిజిత్ ముహూర్తం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12:29:03 నుండి 12:30:35 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.