Menu

  • Home
  • తెలంగాణ
  • ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు..! వీడియో వైరల్
Image

ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు..! వీడియో వైరల్

హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆటో నడుపుతూ డ్రైవర్ సరసాలు వీడియో వైరల్ గా మారింది. ఆటోలో యువతిని పక్కన కూర్చోబెట్టుకుని, ఆమెతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తూ ఆటో నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి రంగంలోకి దిగారు.

ఈ సంఘటన శుక్రవారం మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తా నుండి చాదర్‌ఘాట్ బ్రిడ్జి మార్గంలో చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఆటో నడుపుతున్న ఆ డ్రైవర్, తన పక్క సీట్‌లో కూర్చున్న యువతితో సరసాల్లో మునిగితేలుతూ అజాగ్రత్తగా అతను వాహనాన్ని నడిపాడు. వెనుక వస్తున్న ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొందరు వాహనదారులు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో చాదర్‌ఘాట్ పోలీసుల దృష్టికి వెళ్లింది. పోలీసులు తక్షణమే స్పందించి, ఆ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజీల ఆధారంగా ఆటో రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించారు. ఆటో రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించగా, అది నల్లగొండ జిల్లాకు చెందిన వాహనంగా నిర్ధారణ అయింది.

Also Read..| కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్’ : సీఎం రేవంత్ రెడ్డి

“బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేశాము. ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాము. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటాము” పోలీసులు చెబుతున్నారు.

Share the post