ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. మద్యం కేసులో తనపై ఉన్న కేసులలో నిర్దోషిగా నిరూపితం అయ్యేవరకు తాను సీఎం పదవిలో ఉండబోనని ప్రకటన చేశారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో గత రెండు రోజుల క్రితమే కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన షరతులుతో కూడిన బెయిల్ పై విడుదల అయ్యారు. తాను సీఎం ఆఫీసుకు వెళ్లకూడదని కోర్టు తెలిపింది. ఏవైనా ఫైళ్లపై సంతకాలు చేయాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి అని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని నెలల్లోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నవంబర్ నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీతో ఎన్నికలతో ఢిల్లీలో కూడా ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని కేజ్రీ అన్నారు. ముఖ్యంగా తాను అగ్నిపరీక్షకు సిద్దంగా ఉన్నానని.. తన భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను జైలులు ఉన్న ఈ 6 నెలలు సీఎం పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. తానుగానీ, మనీష్ సిసోడియా కానీ పదవిలో ఉండమని అన్నారు. మరో రెండు రోజుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రకటిస్తామని అన్నారు. ఆప్ పార్టీని చీల్చేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేసిందని.. అందుల భాగంగానే తనను జైలుకు పంపించారని కేజ్రీవాల్ ఆరోపించారు.
आज मैं जनता से पूछने आया हूँ कि आप केजरीवाल को ईमानदार मानते हो या गुनाहगार
— AAP (@AamAadmiParty) September 15, 2024
अब जब तक दिल्ली की जनता अपना फ़ैसला नहीं सुना देती है तब तक मैं CM की कुर्सी पर नहीं बैठूँगा।
मैं आज से 2 दिन बाद मुख्यमंत्री के पद से इस्तीफ़ा दे दूंगा। @ArvindKejriwal #केजरीवाल_ईमानदार_है pic.twitter.com/i59f5U9gVV