ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు (Vinai Kumar Saxena) అందించారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసేవరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్ం ఆప్ ప్రభుత్వాన్నిరాజకీయంగా ఎదుర్కోలేక, దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నారని గతం నుండి కేజ్రీవాల్ చెప్తూ వస్తున్నారు. ఆరు నెలలు జైలులో ఉన్నతర్వాత ఇటీవల ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇటీవల జరిగిన మీటింగ్ లో తాను మాట్లాడుతూ.. తాను నిర్దోషి అని ప్రజలు నమ్ముతేనే తమ పార్టీకి ఓటు వేయండని.. లేకుంటే ఓటు వేయకండని ప్రజలను కోరారు. అప్పటివరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనని ఆయన ఢిల్లీ ప్రజలకు తెలిపారు. ఈమేరకు రెండు రోజుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం తన పదవకి రాజీనామా చేశారు.
అంతకు ముందు ఢిల్లీ నూతన సీఎంగా ప్రస్తుత విద్యాశాఖా మంత్రి అతిషి మార్లేనా సింగ్ (Atishi marlena singh)పేరును ఆమ్ ఆద్మీపార్టీ ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో అతిషి పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. ముఖ్యమంత్రి పదవికోసం పార్టీలో పలువురు పోటీపడ్డారు. అయినా చివరకు అతిషి పేరుకు శాసనసభాపక్షం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. కేజ్రీవాల్ జైలులో ఉన్నసమయంలో పరిపాలన కుంటుపడకుండా అతిషి చూశారు. పార్టీ కార్యక్రమాలను సైతం దగ్గరుండి పర్యవేక్షించారు. ఢీల్లీ ప్రభుత్వంలో ఆమె ప్రస్తుతం విద్య, పి.డబ్ల్యూ.డి, సంస్కృతిక పర్యాటక శాఖల మంత్రిగా పని చేస్తున్నారు.
AAP प्रतिनिधि मंडल और @AtishiAAP जी ने उपराज्यपाल विनय सक्सेना जी से मिलकर सरकार बनाने का दावा पेश किया।@ArvindKejriwal जी के जनता के बीच अग्नि परीक्षा देकर ईमानदार साबित होने तक आतिशी जी मुख्यमंत्री की जिम्मेदारी संभालेंगी और दिल्ली में 'केजरीवाल की काम की राजनीति' को आगे… pic.twitter.com/Erz8S1IwsJ
— AAP (@AamAadmiParty) September 17, 2024