రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది అతిథుల సమక్షంలో పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ప్రసంగించారు. తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు ముఖేష్ అంబానీ భావోద్యేగానికి గురయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేక పోయాడు.
అనంత్ అంబానీ చేసిన భావోద్వేగ ప్రసంగంలో ముఖ్యంగా తాను అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు తన తల్లిదండ్రులు అందించిన సపోర్ట్ గురించి అనంత్ అంబానీ చెబుతుండగా ముఖేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.