Menu

  • Home
  • తెలంగాణ
  • CM Revanth Reddy OSD: సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డిగా అజిత్ రెడ్డి నియామకం
Image

CM Revanth Reddy OSD: సీఎం రేవంత్ రెడ్డికి ఓఎస్డిగా అజిత్ రెడ్డి నియామకం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్‌ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌కు చెందిన ఆయన ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయనను ఓఎస్డీ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అజిత్‌ రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ బోర్డుల్లో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్‌ ఎస్టేట్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

Share the post