మనీలాండరింగ్ కేసులో మళయాల నటి నవ్య నాయర్‌కు ఐఆర్ఎస్ అధికారి (IRS OFFICER) సచిన్ సావంత్ (SACHIN SAWANT)తో సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. దీనికి సంబందించి నటి నాయర్ ను ప్రశ్నించింది. అలాగే, తన వాంగ్మూలాన్నికూడా నమోదు చేసింది. ఆ వాంగ్మూలాన్ని ప్రత్యేక ఈడీ న్యాయస్థానంలో సమర్పించింది. నవ్య నాయర్ మళయాల సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవర్డు కూడా అందుకున్నారు.