రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet meeting) కానుంది. సోమవారం మద్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ భేటీ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
బి.సి రిజర్వేషన్లు (BC Reservations), స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ (Local Body Elections) కేబినెట్ అజెండాలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. మరోవైపు ఈ నెల 24వ తేదీన స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పురోగతి నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, రేపటి కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 న్యాయస్థానాల్లో నిలవడం లేనందున.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిచి ఎన్నికలకు వెళ్ళే అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం రూపొందించే అవకాశం కనబడుతుంది.

వీటితో పాటు, ఇతర అంశాలు కూడా రేపటి సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా, ‘గిగ్ వర్కర్స్’ (ఆన్‌లైన్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు) ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమానికి ఉద్దేశించిన చర్యలపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. ఆర్థిక అంశాల విషయానికొస్తే, రాష్ట్రంలోని రైతులకు డిసెంబరులో రైతు భరోసా సాయం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read..| ఇమ్మడి రవి అరెస్ట్.. ఐబొమ్మ, బప్పం టీవీలు మూసివేత !









