కాళేశ్వరం కమీషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డు సుప్రీంకోర్టు జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆద్యక్షతన కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ 16 నెలలుగా విచారణ చేసింది. 115 మందిని విచారించింది. తాజాగా 600 పేజీల పైచిలుకు రిపోర్టును నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. రిపోర్టులో ఎవరిని భాద్యులు చేశారు.. ఎలాంటి చర్యలకు కమీషన్ సిఫారసులు చేసింది.. ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే అంశాలు కీలకంగా మారాయి.
Also Read..| తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు









