తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుల స్థానాలను ప్రభుత్వ ఖరారు చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 31 జడ్పీ స్థానాలు, 566 జడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలు.. అదేవిదంగా 12,778 గ్రామపంచాయితీలు, ఒకలక్షా 12 వేల వార్డులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సామాగ్రిని సిద్దం చేసుకోవాలని కలెక్టర్లకు, ఆర్డీవోలకు పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also Read…| జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు
గతంలో 570 ఎంపీపీ స్థానాలు(MPP), 570 జడ్పిటిసి స్థానాలు(ZPTC), 5817 ఎంపీటీసీ స్థానాలు (MPTC) ఉండగా వాటిలో కొన్ని ప్రస్తుతం కొన్ని తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకసారి మాత్రమే తెలంగాణలో 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.









