Menu

  • Home
  • జాతీయం
  • ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..మోడీకి తప్పిన ప్రమాదం
Prime minister narendra modi aircraft technical issue

ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..మోడీకి తప్పిన ప్రమాదం

ప్రధాని నరేంద్ర మోడి ప్రయాణించవలసిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. జార్ఖండ్ రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని ప్రయాణించవలసిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ముందుగానే సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించడంతో ప్రధానికి పెను ప్రమాదం తప్పింది. రిటర్న్ వెళ్లవలసిన ఎయిర్ క్రాఫ్ట్ లో సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో విమానంలో ప్రధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

Share the post

Also Read..