Menu

  • Home
  • జాతీయం
  • వారణాసిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నామినేషన్
Image

వారణాసిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నామినేషన్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని వార‌ణాసిలో తన నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బీజేపీ పార్టీ అభ్యర్ధిగా మంగళవారం రోజున స్థానిక వార‌ణాసి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నరేంద్ర మోడీ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఎన్డీఏ భాగస్వామ్య నేత‌లు హాజ‌ర‌య్యారు. వార‌ణాసి నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన మోడీ మూడోసారి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంతకు ముందు ముందు ప్రధాని గంగాన‌దీ తీరంలో ఉన్నద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహంచారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల నడుమ ఆయ‌న గంగాహార‌తి నిర్వ‌హించారు.

దేశ ప్రజల సంక్షేమం కోసం గంగాపూజ చేసిన‌ట్లు మోడీ వెల్ల‌డించారు. మూడోసారి మోడీ ప్ర‌ధాని కావాల‌ని, భారతదేశ పేరు ప్ర‌ఖ్యాత‌లు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వెలిగి పోవాల‌ని కోరుకున్న‌ట్లు పూజారి రామ‌ణ్ తెలిపారు. అన్ని ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోడీకి ఘ‌న విజ‌యం ల‌భించాల‌ని ఆశీర్వ‌దించిన‌ట్లు మ‌రో పూజారి సంతోష్ నార‌య‌న్ తెలిపారు. ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజల త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో కొద్దిసేపు విహ‌రించారు. సోమ‌వారం రాత్రే ప్ర‌ధాని నరేంద్ర మోడీ కాశీ విశ్వేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు.

Share the post

Also Read..