Menu

  • Home
  • జాతీయం
  • చంద్రయాన్ 3: చంద్రుని దక్షిణ ద్రువంపై ఆక్సీజన్ తో పాటు ఇతర ఖనిజాలు : ఇస్రో
Image

చంద్రయాన్ 3: చంద్రుని దక్షిణ ద్రువంపై ఆక్సీజన్ తో పాటు ఇతర ఖనిజాలు : ఇస్రో

చంద్రయాన్-3 ద్వారా చంద్రుని మీదకు పంపబడిన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ తన పరిశోధనలు కొనసాగిస్తోంది. రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాలు ఉన్నాయని కనుగొన్నది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ల్యాండర్ (శివ శక్తి పాయింట్) నుండి చంద్రునిపై కాలు పెట్టిన క్షణం నుండి రోవర్ తన పనిని ప్రారంభించిది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణగ్రతల వివరాలను ఇప్పటికే ఇస్రోకు చేరవేసింది. ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు ఉన్నట్లు కూడా కనుగొన్నది.

రోవర్‌లోని లిబ్స్ పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై సల్ఫర్ (S), టైటానియం(Ti), క్రోమియం(Cr), సిలికాన్(Si), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), అల్యూమినియం(Al), ఇనుము(Fe)లతో పాటు ఇంకా ఇతర మూలకాలు కూడా ఉన్నట్లు రోవర్ గుర్తించింది. హైడ్రోజన్ కోసం రోవర్ పరిశోదన కొనసాగుతుందని ఇస్రో తెలిపింది. చంద్రుని దక్షణ ద్రువంపై ఇంతవరకూ ఏ దేశం కూడా కాలు మోపలేదు. ఇప్పుడు భారత్ చంద్రునిపై చేస్తున్న పరిశోదనలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది.

Share the post

Also Read..