దేశంలో 21 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవడానికి నిరాకరిస్తున్నారట. ముఖ్యంగా ప్రధాన పట్టణాల్లో జాబ్ చేసే యువతులు 25 శాతం మందికి పెళ్లి ఇష్టం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 11 శాతం మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందని చెప్తున్నారు. సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ చైర్‌పర్సన్ ఉషా శశికాంత్ మాట్లాడుతూ.. ‘నేటి అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కానీ, పెళ్లి విషయంలో సమాజం, కుటుంబం వారిని ఆదుకోవు. కుటుంబంలో కూడా అమ్మాయిలను ఇంకా శక్తివంతంగా తీర్చిదిద్దాలి, వారి నిర్ణయాలను గౌరవించడం నేర్చుకోవాలి..’ అని అంటున్నారు.