...

మళ్లీ శివసేనవైపు బీజేపీ చూపు..?

మహారాష్ట్రలో తమ మాజీ మిత్ర పక్షమైన శివసేన పార్టీతో మళ్లీ జట్టు కట్టేందుకు భారతీయ జనతా పార్టీ తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శివసేన పార్టీని నిట్ట నిలువునా చీల్చి, థాక్రే ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఏక్ నాథ్ శిండేను ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ.. ఇప్పుడు మళ్లీ శివసేన వైపు ఎందుకు చూస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

మహారాష్ట్రాలో గత కొన్ని దశాబ్దాల పాటు శివసేన-బీజేపీల మైత్రి కొనసాగుతూ వచ్చింది. అయితే ఇంత కాలం పాటు శివసేన మేజర్ భాగస్వామిగా.. బీజేపీ మైనర్ భాగస్వామిగా ఉండేవి. ఇలా ఉండేందుకు బీజేపీకి ఇష్టం లేదు. మహారాష్ట్రలో తాము బలపడేందుకు ఎంతవరకైనా వెళ్లాలని భావించింది. 2019 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవిని థాక్రేకు ఇవ్వడం ఇష్టం లేదు. దాని పర్యావాసానమే దశాబ్దాల పాటు తమతో ఉన్న మిత్రపక్షంతో విభేధించింది. దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిని చేయగలిగింది. ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్, ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) లతో మహారాష్ట్ర వికాస్ అఘాడి అనే కూటమిని ఏర్పాటు చేసి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి కాగలిగారు. దీంతో బీజేపీ వారం గడవకుండానే ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లిపోయింది.

గత సంవత్సరం బీజేపీ దర్శకత్వంలో శివసేన పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. మెజారిటీ శాసన సభ్యులు, పార్టమెంటు సభ్యులు ఏకనాథ్ శిండే వైపు వచ్చారు. అంతే కాకుండా తామదే నిజమైన శివసేన వర్గంగా ప్రకటించుకున్నారు. అయితే ఇక్కడే అసలు విషయం అర్థం అవుతుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లు ఉన్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇక్కడి లోక్ సభ సీట్లు అవసరం. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్పీపీ కలిసి ఉంటే.. బీజేపీ ఇక్కడి మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవడం కష్టసాధ్యం. అంతే కాకుండా తమదే నిజమైన శివసేన అని ప్రజాక్షేత్రంలో తెల్చుకోవడానికి ఉద్ధవ్ థాక్రే తెలివిగా పావులు కదిపాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు అయిన ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ అగాఢీ బహుజన్ పార్టీతో కలిసి ముంబాయి కార్పోషన్ ఎన్నికల్లో ముందుకు వెళ్తమని థాక్రే ప్రకటించాడు. దీంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి దిమ్మతిరిగే షాక్ తగిలింది.

ఎందుకంటే శివశక్తి, భీమ్ శక్తి కలుస్తే మరాఠా, దళిత ఓటర్ల కలయిక వల్ల చాలా పెద్ద శక్తిగా ముంబాయిలో అవతరించే అవకాశం ఉందని బీజేపీకీ అర్థం అయింది. అయితే ప్రకాష్ అంబేద్కర్ ఓటు బ్యాంకు కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉన్న ఓటు బ్యాంకు చాలా వరకు ఒకటే. దీనివల్ల సహజంగానే వంచిత్ అఘాడీ పార్టీతో కాంగ్రెస్, ఎన్సీపీలు పొత్తుకు ఒప్పుకోవు. కానీ ఉద్ధవ్ థాక్రేను దూరం చేసుకోవడం ఇష్టం లేని కాంగ్రెస్ ఎన్సీపీలు కూటమిలో శివసేనకు కేటాయించిన సీట్లలో వారు కావాలనుకుంటే ప్రకాష్ అంబేద్కర్ కు ఇచ్చుకోవచ్చునని ఇటీవల శరత్ పవార్ మాటల వల్ల అర్థం అవుతోంది. అందువల్ల కూటమిలో నాలుగవ భాగస్వామిగా ప్రకాష్ అంబేద్కర్ చేరకపోవచ్చు. కానీ శివసేనకు కేటాయించిన సీట్లలో కొన్ని సీట్లు వంచిత్ అఘాడీ బహుజన్ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది.

ఏది ఏమయినా ముంబాయి కార్పోరేషన్ ఎన్నికల్లో ఉద్థవ్ థాక్రే శివసేన గెలిస్తే ఏక్ నాథ్ శిండేను ముఖ్యమంత్రి పదవిలో నుండి దించే అవకాశాలు లేకపోలేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, వంచిత్ అఘాడీ బహుజన్ పార్టీలు కలిసి ఉంటే మహారాష్ట్ర లోని 48 ఎంపీ సీట్లలో మోజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి ముంబాయి కార్పోరేషన్ ఎన్నికలకంటే 2024లో కేంద్రంలో అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. ఇప్పటికే బీహార్ లో నితీష్ కుమార్ దూరం అయ్యారు. తమ మిత్ర పక్షాన్ని బలహీన పరిచి అయినా బీజేపీ ఎదగాలని ఆలోచించి.. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది. నితీష్ కుమార్ నేత్రుత్వంలోని జేడీ(యు) కు కేటాయించిన సీట్లలో చిరాగ్ పాశ్వాన్ ఆద్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ తరపున అభ్యర్థులను నిలిపి, భారీగా ఓట్లు చీల్చింది. దీనివల్ల స్వల్ప తేడాతో జేడీ(యు) పార్టీ చాలా సీట్లు కోల్పోయి.. నితీష్ కుమార్ ను తక్కువ సీట్లకే పరిమితం చేసి, మేజర్ పార్టీని మైనర్ పార్టీగా చేసింది.

ఇక తమ పార్టీని బీజేపీ చీలుస్తుందని గ్రహించిన నితీష్ బీజేపీతో ఉన్న పొత్తులో నుండి వీడి కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఉత్రర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, ఆర్ ఎల్ డీ లు కలిసి బలంగా ఉన్నాయి. ఇక కర్ణాటకలో బీజేపీ అవినీతి ఆరోపణలను ఎదర్కొంటుంది. ఇక్కడ మళ్లీ అధికారంలోకి రావడం అంత సులభం కాదు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక రాష్ట్రాలలోని మొత్తం సుమారు 200 ఎంపీ సీట్లు ఉంటాయి. వీటిలో దాదాపు 150 సీట్లు కోల్పోయినా అది బీజేపీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

వీటిని అన్నింటినీ నిశితంగా గమనించిన బీజేపీ జాతీయ నాయకత్వం మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో మొజారిటీ సీట్లు గెల్చుకోవాలంటే ఏక్ నాథ్ షిండేతో వెళితే నష్టమని భావిస్తున్నారు. అందువల్ల ఉధ్దవ్ థాక్రేను మళ్లీ కలుపుకొని వెళ్లడమే మంచిదని అధిష్టానం చూస్తుంది. కానీ ఏక్ నాథ్ షిండే వర్గాన్ని పార్టీలో కలుపుకొని బలమైన శక్తిగా ఎదగాలని రాష్ట్ర బీజేపీ చూస్తుంది. తన పార్టీని నిట్టనిలువునా చీల్చి, ముఖ్యమంత్రి పదవిలో నుండి దించారు కాబట్టి సహజంగానే ఉధ్ధవ్ థాక్రే బీజేపీ పార్టీపై కోపంగా ఉన్నాడు.

బీజేపీ మాత్రం ఉధ్దవ్ తో సయోద్య కొరకు ప్రయత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. రెండు పార్టీలకు సన్నిహితంగా ఉన్న ఒక పెద్ద పారిశ్రామిక వేత్త, ఉద్ధవ్ థాక్రేతో సన్నిహిత సంబందాలున్న బీజేపీ అగ్రనేత చర్చల ప్రక్రియను ప్రారంభించారని అంటున్నారు. ఒకవేళ అవసరం అయితే షిండేను ముఖ్యమంత్రి పదవి నుండి దింపి అయినా మళ్లీ ఉద్దవ్ ను సీఎం చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే షిండే వర్గం లోని ఎమ్మెల్యేలు ఉద్దవ్ తో టచ్ లో ఉన్నారు. ముంబై కార్పోరేషన్ ఎన్నికలలో ఉద్ధవ్ థాక్రే వర్గం విజయం సాదిస్తే ఏక్ నాథ్ షిండే వర్గం ఖాళీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉద్ధవ్ తో వెళితేనే మెజారిటీ సీట్లు గెలుస్తామనే నిర్ణయానికి భీజేపీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉద్ధవ్ థాక్రే తిరిగి బీజేపీతో కలుస్తారా? దీనిపై ఉద్ధవ్ ఎలా స్పందిస్తారు? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

RajBhavan: కులగణనపై గవర్నర్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనతో...

డెడికేటెడ్ కమీషన్ చైర్మెన్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన...

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజకీయాలా? మంత్రి సీతక్క ఫైర్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాలలో జ‌రిగిన ఫుడ్...

Diwali: జవాన్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు

2014 కు ముందు దేశంలో ఎటు చూసినా ఉగ్రవాదుల అలజడి, బాంబుల...

TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు(BR Naidu)...

Topics

RajBhavan: కులగణనపై గవర్నర్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనతో...

డెడికేటెడ్ కమీషన్ చైర్మెన్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన...

ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై రాజకీయాలా? మంత్రి సీతక్క ఫైర్

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాలలో జ‌రిగిన ఫుడ్...

Diwali: జవాన్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు

2014 కు ముందు దేశంలో ఎటు చూసినా ఉగ్రవాదుల అలజడి, బాంబుల...

TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు(BR Naidu)...

దీపావళి వేడుకల్లో తమన్నా భాటియా.. పింక్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ

మిల్కీబ్యూటీ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు తమన్నా భాటియా (Tamannaah...

హైడ్రా కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ...

యాదగిరిగుట్ట స్థాయిలో కొమురవెళ్లి అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి (komuravelli mallikarjuna swamy...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.