డ్రగ్స్ నిర్మూలనలో యువతదే బాధ్యత: సీపీ తరుణ్ జోషి

నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ శశాంక తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ, యువత మరియు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం యెుక్క దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతో పాటు కళాశాలల్లో కూడా రాచకొండ కమిషనరేట్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేకదినం సందర్భంగా గురువారం మహేశ్వరం జోన్ పరిధిలోని తుక్కుగూడలో రాచకొండ పోలీస్ కమిషనరేట్, మహేశ్వరం డీసీపీ మరియు ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్, మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల శాఖ ఆధ్వర్యంలో నిషేధిత మత్తుపదార్థాలు మరియు మానవ అక్రమరవాణా వ్యతిరేక వాకథాన్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కమీషనర్ మాట్లాడుతూ సాధారణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భావించాలని, తమ పరిసరాల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో మత్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత తమ వంతు భాధ్యత నిర్వహించాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారితో “మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని” ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఐఏఎస్ తో పాటు కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ ఇతర అధికారులు మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img