హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో కాంగ్రెస్ రాష్ర్టస్థాయి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల మీటింగ్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చేర్యాల మండల యువ నాయకుడు అందె నానిబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. చేర్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై సీఎం పలు సూచనలు చేశారని అందె నానిబాబు తెలిపారు.