తెలంగాణలో వైన్స్ టెండర్లకు దరఖాస్తు గడువు ముగిసింది. మద్యం షాపులను దక్కించుకోవడానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. టెండరు వేయడానికి దరఖాస్తు ఫీజును 2 లక్షలుగా నిర్ధారించారు. రాష్ట్రం మెత్తంగా లక్షకు పైగా అప్లకేషన్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి అప్లికేషన్ల ద్వారానే 2 వేల 697 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో టెండర్లకు 79 వేల దరఖాస్తులు మాత్రమే వస్తే, ఈ సారి లక్ష దరఖాస్తులు దాటడం గమనార్హం.
సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్ లో అత్యధికంగా 8 వేల 883 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్ యూనిట్ 8 వేల 749 అప్లికేషన్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ నెల 21వ తేదీ సోమవారం రోజున లక్కీ డ్రా తీస్తారు. ప్రభుత్వం వైన్ షాప్ లలో రిజర్వేషన్ కేటాయించిన విషయం తెలిసిందే. గౌడ కులస్ధులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5 శాతం గా లక్కీడ్రాలో షాపులను కేటాయిస్తారు.