విద్యుత్ విచారణకు రాకుండా.. కేసిఆర్ ఎదురుదాడిపై సీఎం, డిప్యూటీ సీఎంల మౌనం ఎందుకు : ఏలేటి

విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట మాజీ సిఎం కేసిఆర్ హాజరు కాకుండా, అసలు కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదంటూ విమర్శించడాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదని, అసలు వివరణ ఇవ్వకుండా, విచారణ కమిషన్ నే విమర్శిస్తూ… లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమే అని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ తీరు అప్రజాస్వామికమని మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. అసలు తన పాలనలో విద్యుత్ రంగంలో తప్పులే జరగకపోతే కమిషన్ ముందు హాజరై వివరాలు చెప్పడానికి కేసిఆర్ కు భయం ఎందుకని ప్రశ్నించారు.

ఏకంగా విచారణ కమిషన్ నే తప్పుపడుతూ… మాజీ సిఎం కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే…ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎందుకు స్పందించడం లేదనీ ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన కమిషన్ నే కెసిఅర్ తప్పు పడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై సీబీఐ విచారణతో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాజీ జడ్జీతో విచారణ కమిషన్ వేసిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరి తమ చిత్త శుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ఈ విషయంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వాఖ్యలు సరికావన్నారు. కమిషన్, విచారణ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తప్పులు జరగనప్పుడు వాస్తవాలు కమిషన్ ముందు చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు.

మెదక్ ఘటనపై

ఇక మెదక్ లో జరిగిన ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసుల తీరు సరికాదని మహేశ్వర్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వ తీరు ఉందన్నారు. గోవధను అడ్డుకున్న వారిపై దాడులు చేయడం మంచిది కాదని, ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను, మమ్మల్ని అడ్డుకోవడం సరికాదని తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

Topics

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img