రాష్ట్రంలో ఖాళీ అవనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ గెలు చుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న జోగినపల్లి సంతోష్ కుమార్, పాటు బడుగుల లింగయ్య యాదవ్, యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పద వీకాలం ఏప్రిల్ 2న ముగియనున్నది. ఈసారి ఇందులో ఎవరినైనా కేసీఆర్ మరోసారి రాజ్యసభకు పంపిస్తారా ? లేదా తానే స్వయంగా రాజ్యసభకు వెళ్తారా? లేదా, కుటుంబం నుంచే ఒకరికి అవకాశం కల్పిస్తారా? అలాకాకుండా కొత్త అభ్యర్థిని ఖరారు చేస్తారా? అని పార్టీలో ఆసక్తి కర చర్చ జరుగుతున్నది.
ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో కచ్చితంగా గెలిచే సీటు కావడంతో కేసీఆర్ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. గెలిచేది ఓకే సీటు కావడంతో పార్టీలో పోటీ విపరీతంగా ఉంది. ఈ సీటుకోసం ఇప్పటికే అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మూడోసారి బీఆర్ఎస్ గెలుస్తుందని భావించి.. ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. అంతే కాకుండా, కొందరికి హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. వారిలో ప్రధానంగా పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో ఆశావహులు తమ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. గులాబీ బాస్ మదిలో ఎవరి పేరు ఉందో అని పార్టీ లీడర్స్ అనుకుంటున్నారు. మొత్తానికి ఒకటే సీటు కావడంతో ఓవర్ లోడ్ తో ఉన్న కారు పార్టీలో రాజ్యసభ సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి.