కేంద్ర మంత్రి పదవి తెలంగాణలో ఎవరిని వరిస్తుందోనని చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం నుండి 8 ఎంపీ స్థానాలు గెల్చుకున్న బీజేపీ, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుంకంటారనే చర్చ మొదలయింది. ఇప్పటికే ఆశావహుులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచిన 8 మందిలో 7గురు సీనియర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడంతో కేవలం కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం లభించింది. ఈసారి తెలంగాణకు రెండు మంత్రి పదవులు వస్తాయని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి మంత్రి పదవుల కోసం రాష్ట్ర ఎంపీలు డిల్లీ లెవల్ లో లాబీయింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. మహిళా కోటాలో డీకే అరుణ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది.