NewsTelanganaTelangana BJP Chief: తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి..? పోటీలో ఉన్నది...

Telangana BJP Chief: తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి..? పోటీలో ఉన్నది వీరే..!

-

- Advertisment -spot_img

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఎవరున్నారు ? కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా వెళ్లడంతో అధ్యక్ష బాధ్యతలను హై కమాండ్ ఎవరికి అప్పగిస్తుంది? సెల్యూట్ తెలంగాణ పేరుతో తెలంగాణకు ధన్యవాదాలు చెప్పడం కూడా పూర్తి అయింది. ఇక ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా నిర్మించడమే బీజేపీ కర్తవ్యమా ? పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎప్పుడు రానున్నారు ? బీజేపీలో ఇప్పుడు దీనిపైనే హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

2019తో పోలిస్తే కాషాయ దళం తెలంగాణలో బాగా బలపడింది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి.. ఏకంగా 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఈసారి కేంద్ర మంత్రి వర్గంలో తెలంగాణ నుండి ఇద్దరికీ ఛాన్స్ లభించింది. కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ధక్కగా.. సహాయ మంత్రి పదవి బండి సంజయ్ ని వరించింది. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి కేంద్ర మంత్రులు హైదారాబాద్ కు రావడంతో.. వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 8 ఎంపీ సీట్లు అందించిన తెలంగాణకు సెల్యూట్ తెలంగాణ పేరుతో ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు, మంత్రివర్గంలో చోటు అన్నీ జరిగిపోయాయి. ఇక పార్టీ అధ్యక్షుని సీటు కోసం పార్టీలో పోటీ విపరీతంగా ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈటెల, డీకే అరుణ పేర్లు కేంద్ర మంత్రి పదవుల విషయంలో చర్చకు వచ్చినా.. మొదటి నుంచీ పార్టీతోనే ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను మోడీ ఎంపిక చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కావడంతో.. ఆయన వారసునిగా పార్టీ అధ్యక్షునిగా ఎవరిని ఎంపిక చేస్తారోనని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. మల్కాజ్ గిరి నుండి ఎంపీగా గెలిచిన ఈటెల పేరు అధ్యక్షుని రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈటెల కాకుంటే.. మహబూబ్ నగర్ ఎంపీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లు అధ్యక్షుని రేసులో ఉన్నారని చెప్తున్నారు. వీరు కాకుండా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, చింతల రాంచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఆచారి కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారట.

తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేయడం, గ్రామ స్థాయి నుండి జిల్లా, రాష్ర్ట స్థాయి కమిటీలపై దృష్టి సారించాలని బీజేపీ చూస్తోంది. అందులో భాగంగానే అధ్యక్షుడిని వీలయినంత తొందరగా నియమిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించిందని.. ఇక రాబోయే రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదగుతుందని బీజేపీ భావిస్తుంది. ప్రస్తుతం 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని.. 2028లో 88 సీట్లతో తెలంగాణలో అధికారంలోకి వస్తామని తహతహ లాడుతున్నారు.

గత ఏడాది జూన్ లో రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్ష పదవితో పాటు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే, బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తికి రెండు పదవులు ఉండకూడదు. పార్టీ పదవితో పాటు మంత్రి పదవిలో ఉండటానికి ఆస్కారం ఉండదు. దీంతో కొత్త అధ్యక్షుని ఎంపిక తప్పనిసరి అని తెలుస్తోంది. దీనికితోడు కిషన్ రెడ్డి కూడా అధ్యక్ష మార్పు ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా చాలా రాష్ట్రాలలో అధ్యక్షులను ఎక్స్ టెన్షన్ ఇచ్చి కొనసాగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో.. జాతీయ అధ్యక్షుడిని కూడా మారుస్తారని తెలుస్తోంది. అయితే జాతీయ అధ్యక్షుడి మార్పు తర్వాత రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉంటుందా.. లేదా అంతకు ముందే ఉంటుందా అని చర్చ నడుస్తోంది. ఈటెల రాజేందర్ కే అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని అటు పార్టీలో, ఇటు బయట చర్చ జరుగుతోంది. ఈటెల కు పార్టీ పగ్గాలు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ లో నుండి బీజేపీ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమయినా రాష్ట్ర అద్యక్ష భాద్యతలు ఎవరు చేపడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయవలసిందే.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

ఆదివాసీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు

ఆదివాసీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు ఉంటాయిని మంత్రి సీత‌క్క తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునికీకరణ పనులపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి...

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...
- Advertisement -spot_imgspot_img

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you