రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సమన్లు, వారెంట్ల జారీ సిబ్బందితో సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ వీడియో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్థులు తప్పించుకోవడానికి వీలు లేని విధంగా విచారణాధికారులు, కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సమన్లు, వారెంట్ల జారీ సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరితగతిన కేసుల దర్యాఫ్తు పూర్తి చేయాలని, నేరస్తులకు గరిష్ఠశిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
పహాడి షరీఫ్ వివాహిత హత్యకేసుతో పాటు ఘట్ కేసర్ చిన్నారి అపహరణ కేసులో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి నిందితులకు కఠినశిక్ష పడేలా పనిచేసిన అప్పటి పహాదశారీఫ్ పోలీసు స్టేషన్లో విచారణాధికారి ACP లక్ష్మి కాంత రెడ్డి, అప్పటి ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ సుధీర్ బాబు., ఐపిఎస్ నేరెడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఘట్ కేసర్ పరిధిలో నమోదైన నాలుగున్నరేళ్ల చిన్నారి అపహరణ మరియు అసభ్య ప్రవర్తన కేసులో ప్రధాన నిదితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు
ఘట్ కేసర్ పరిధిలో గత ఏడాది జూలై నెలలో నాలుగున్నరేళ్ల చిన్నారి కృష్ణవేణి అపహరణ మరియు అసభ్య ప్రవర్తన సంఘటన *Cr.NO 541/2023 ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ U/S : 363,342, IPC, సెక్షన్:6 & 18 ఆఫ్ పోక్సో చట్టం SC నం.640/2023 కేసులో కుషాయిగూడలోని మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు నిందితుడు రావూరి సురేష్ S/o: మధన్ మోహన్ రావు వయస్సు: 30 సంవత్సరాలు, కులం: చారి , వృత్తి: లేబర్ , నివాసం: HNo: 4-153, EWS కాలనీ ఘట్‌కేసర్ ను దోషిగా నిర్ధారించడం జరిగింది. ఈ కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 1,0000/- జరిమానా విధించబడింది. బాధిత కుటుంబానికి పరిహారం 100000 అందించబడిందని తెలిపారు.
ఈ కేసులో వివరాల ప్రకారం….బాధిత చిన్నారి ఇంటి దగ్గరలో నివసించే వ్యక్తి సురేష్, గతేడాది జులైలో ఘటన జరిగిన రోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో చాక్లెట్ కోసం బయటికి వచ్చిన పాపను అపహరించడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న ఘట్కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి పరిసరాల్లోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించి పాపను అపహరించిన సురేష్ కదలికలను గమనించారు. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్న అనంతరం చిన్నారిని రక్షించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. గంటల వ్యవధిలోనే తమ బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు: రాచకొండ సిపి సుదీర్ బాబు ఐపిఎస్
రాచకొండ పరిధిలో ఎలాంటి నేరం జరిగినా 24 గంటల్లో నిందితులను పట్టుకుంటున్నామని, నేరాలను అదుపుచేసే సంకల్పంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆడపిల్లలకు, మహిళల భద్రత కోసం రాచకొండ పోలీసులు అహర్నిశలూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళ భద్రతకు సంబంధించిన కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీ.సీ.ఆర్.బి ఎసిపి రమేష్, ACP లక్ష్మికాంత రెడ్డి, ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ సుధీర్ బాబు ఐపిఎస్#రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, #సమన్లు, #వారెంట్ల జారీ సిబ్బందితో సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు వీడియో #సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ… pic.twitter.com/0kU8K41Bhu
— Rachakonda Police (@RachakondaCop) July 20, 2024