ప్రజల సమస్యలు పరిష్కారించడమే ప్రభుత్వ ధ్యేమయని, రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ పాలన అందించటమే తమ ముందున్న ధ్యేయమని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
పెట్లవెల్లి మండలం మల్లేశ్వరం, మంచలాకట్ట గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. గ్రామ సభలను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి దరఖాస్తు ఫారాలను స్వీకరించారు.
సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ…. ఎన్నికల ఇచ్చిన హమీ మేరకు సీయం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలకు కార్యచరణ రూపోందించి అమలు చేస్తుందన్నారు. అర్హులైన పేదలకు మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత లాంటి ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడం కోసం ప్రజల వద్దకే ప్రజా పాలనను పారదర్శకంగా నిర్వహించడానికి గ్రామ సభలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలను , అభివృద్ధి ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల వద్దకు వస్తుందని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అవినీతి రహిత పాలన కోసమే కాంగ్రెస్ కు పట్టం
అవినీతి రహిత పాలన కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మంత్రి జూపల్లి అన్నారు. మంచలాకట్టలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చకునేందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
మీ నమ్మకాన్ని వమ్ము చేయను: మంత్రి జూపల్లి
మల్లేశ్వర్వంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి జూపల్లి కృష్ఱారావు మాట్లాడారు. నాపై ఎంతో నమ్మకంతో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ నమ్మకాన్ని మమ్ము చేయను. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. శక్తి వంచన లేకుండా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించిన కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.