ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీని నాంపల్లిలోని తెలంగాణ ఎక్సైజ్ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. పదోన్నతులు, బదిలీలు ఇతర అంశాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల సమస్యలు న్యాయ సమ్మతమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.

త్వరలోనే అబ్కారీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి, అన్ని అంశాలపై క్షుణంగా చర్చిస్తానని భరోసానిచ్చారు. స్ఠాండర్డ్ ఆపరేషన్ ప్రోసీజర్ ను తయారు చేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని, ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమయపాలన పాటించాలని సూచించారు. విధుల నిర్వహణతో పాటు కుటుంబ ఆలనపాలన కూడా అంతే ముఖ్యమని, పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, అబ్కారీ శాఖ కమిషనర్ చేవ్వూరు హరికిరణ్, ఎక్నైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, జాయింట్ కమిషనర్లు ఖురేషి, కేఏబి శాస్త్రీ, సురేష్, బెవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్లు అబ్ర హం, కాశీనాథ్‌లతో పాటుటు డిప్యూటి కమిషనర్లు, అసిస్టేంట్ కమిషనర్లు, ఇతర ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.