పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయ ప్రాంగణంలో నిషేదించడంలో విజయం సాదించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించడం వలన ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఈ విషయంలో సహకరించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. డిసెంబర్ 3వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా సచివాలయం మారనుందని ఆమె తెలిపారు.
డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేదించాలని నిర్ణయం తీసుకుని 45 రోజులు గడిచిన సందర్భంగా శుక్రవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. సచివాలయంలోని వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సచివాలయం అధికారులు, సిబ్బంది సింగిల్యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కూడా అన్ని హెచ్ ఓ డి లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్నిఅలవాటు చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్య కార్యదర్శులకు, కార్యదర్శులకు కూడా ప్లాస్టిక్ నిషేధం పై ఆమె పలు సూచనలు చేశారు. సంబందిత విభాగాలలో ప్లాస్టిక్ నిషేదం పై తగు ఆదేశాలు జారీచేశారు. స్వచ్చమైన నీరు అందించేందుకు తగు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని కార్యదర్శులకు సూచించారు. సచివాలయ ప్రాంగణంలో ప్రతి రోజు మూడు వేలకు పైగా సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ వినియోగించే వారని ఈ ఆదేశాల నేపద్యంలో రెండు వందలలోపు వరకు తగ్గించగలిగామని సి ఎస్ పేర్కొన్నారు.
సచివాలయం ఆవరణలో స్వచ్చమైన మంచినీరు అందించేందుకు 32 ఆక్వాగార్డు వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో క్లాత్, జూట్, స్టీల్ వస్తువుల వినియోగాన్ని పెంచాలని ఆమె సూచించారు. సచివాలయం సందర్శంచే సమయంల సందర్శకులు పూల బొకేల స్థానంలో ప్లాస్టిక్ రహిత మొక్కలను వినియోగించడానికి వీలుగా సచివాలయం ప్రాంగణంలో గ్రీన్ కియాస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో రోజూ వారీగా పేరుకుపోతున్న వ్యర్ధపదార్దాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి వినియోగదాలరుకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయాలని ఆమె సూచించారు. సచివాలయ ప్రాంగణాన్ని జీరో వేస్ట్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషిచేయాలని ఆమె సూచించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయంలో స్వచ్ఛందంగా నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులనుండి, ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ప్రధానంగా, వాటర్ బాటిళ్లు, కవర్లు, ప్లేట్లు,కప్పులు, గ్లాసులు, స్ట్రాలలో ప్లాస్టిక్ వి ఎక్కువగా వాడుతున్నారని, వీటి స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువులు వాడాలని కోరారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏ ఎస్ అధికారులు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పలు విభాగాల అధిపతులు, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యలు తదితరులు పాల్గొన్నారు.