వరంగల్ -నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రెండు రౌండ్లు పూర్తయ్యాయి. రెండు రౌండ్లలో లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ముందున్నారు. నిన్నఉదయం 8 గం.కు ప్రారంటభం అయిన ఓట్ల లెక్కంపు ఇంకా కొనసాగుతోంది. నాలుగు రౌండ్లకు గాను రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
భారీగా చెల్లని ఓట్లు:
చెల్లని ఓట్లతో అధికారలకు తలనొప్పిగా మారుతోంది. చెల్లని ఓట్లను నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. పట్టభద్రులకు ఓటు వేయడంపై అవగాహన లోపమే కారణమని తెలుస్తోంది. ఈక్రమంలోనే అధికాంగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పేపర్ పై కొందరు జై జై అని, ఐ లవ్ యూ అంటూ మరి కొందరు, బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు ఇంకొందరు గ్రాడ్యుయేట్లు ఓటు వేయడం వల్ల వాటినన్నింటినీ చెల్లని ఓట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు.
మొదటి రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు:
తీన్మార్ మల్లన్న 36,210 ( కాంగ్రెస్ )
రాకేష్ రెడ్డి 28,540 ( బీఆర్ఎస్ )
ప్రేమెందర్ రెడ్డి 11,395 (బీజేపీ )
అశోక్ పాలకూరి 9,019 (స్వతంత్ర)
రెండో రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్లు:
తీన్మార్ మల్లన్న 34,575 ( కాంగ్రెస్ )
రాకేష్ రెడ్డి 27573 ( బీఆర్ఎస్ )
ప్రేమెందర్ రెడ్డి 12,841 (బీజేపీ )
అశోక్ పాలకూరి 11,018 (స్వతంత్ర)
రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి అభ్యర్థులకు వచ్చిన ఓట్లు:
కాంగ్రెస్ – 70,785 (తీన్మార్ మల్లన్న)
బీఆర్ఎస్ – 56,113 (రాకేష్ రెడ్డి)
బీజేపీ – 24,236 (ప్రేమెందర్ రెడ్డి)
అశోక్ పాలకూరి (స్వతంత్ర) – 20,037