సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి భారత ఉప రాష్ట్రపతి దంపతులు జయదీప్ ధన్ఖర్, సుదేష్ ధన్ఖర్ గార్లు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి దంపతులకు గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర రవాణా,బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర డిజిపి జితేందర్, ప్రొటొకాల్ జాయింట్ సెక్రటరీ ఎస్.వెంకట్రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి, ఇతర నాయకులు తదితరులు స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఉపరాష్ట్రపతి దంపతులు కంది ఐఐటీకి బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి దంపతులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.