బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియమించారు. పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావును ఖరారు చేసి, రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లేఖ రాశారు. రవిచంద్ర ఇటీవలే రెండవసారి రాజ్యసభకు తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంధర్బంగా తనను పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా నియమించినందుకు వద్దిరాజు రవిచంద్ర కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను, పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావును నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ లేఖ రాసారు. pic.twitter.com/e9hM47varp
— BRS Party (@BRSparty) June 23, 2024