గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంబించారు. ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా తిరంగా ర్యాలీ యాత్రను నిర్వహిస్తామని అన్నారు.
గతంలో 75 సంవత్సరాల స్వతంత్ర పండుగ సందర్భంగా సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారని కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారని అన్నారు. ఈ తిరంగా ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు పాల్గొని దేశ సమగ్రత దేశ సమైక్యత కాపాడి, స్వాతంత్ర ఉత్సవాలకు సంబంధించిన చరిత్ర ప్రపంచానికి.. యువతరానికి చెప్పాల్సిన బాధ్యత మనంతదరిపై ఉందని అన్నారు.