NewsTelangana"ఏక్ పేడ్ మా కే నామ్" రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రి కిషన్...

“ఏక్ పేడ్ మా కే నామ్” రాష్ట్ర ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు

-

- Advertisment -spot_img

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మాకే నామ్’ పిలుపు మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం డిల్లీలోని నివాసంలో తన మాతృమూర్తి పేరిట ఓ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తితో మొక్కలు నాటుతూ.. అమ్మను గౌరవించుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. మొక్క నాటిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు.

మన జీవితంలో అమ్మ తర్వాతే అన్ని.. కాబట్టి అమ్మ నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా గుర్తుగా అమ్మ గౌరవనికి గుర్తుగా ప్రతి ఒక వ్యక్తి చెట్టు నాటలని అమ్మ గౌరవాన్ని పెంచాలన్నది ప్రధాని మోదీ గారి ఆలోచన అన్నారు. అమ్మ మనల్ని ఎలా పెంచి పెద్ద చేసిందో అదే తరహాలో నాటిన మొక్కను కూడా సంరక్షించి పెద్దగా చేసే వరకు కాపాడి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యలు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలి అమ్మే ఒక స్ఫూర్తి కావాలన్నది మోదీ ఆకాంక్ష కాబట్టి అందరూ మొక్కలు నాటాలన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు.. మన పరిసరాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్న తరుణంలో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాలని కోరారు. అడవులు తగ్గిపోతుండటం, పచ్చదనం కోల్పోతున్న తరుణంలో భవిష్యత్తుకు ఒక పెను సవాల్ లాంటిది భారతమాతను కూడా అమ్మలా భావిస్తాం భూమిని కూడా అమ్మలా భావిస్తాం కాబట్టి అమ్మ పేరుతో భారతమాతను భూమిని కాపాడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే మా అమ్మ పేరుతో తాను ఒక మొక్కను నాటారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తన అమ్మ పేరుతో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెట్టు పెట్టడమే కాదు ఆ చెట్టును సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులకు సెలబ్రిటీలకు పారిశ్రామికవేత్తలకు అమ్మ పేరుతో మొక్క నాటలని పిలుపునిచ్చారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you