అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రప్రభుత్వం రూ.715 కోట్లతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రధానమంత్రి చేతుల మీదుగా.. ఈ రైల్వే స్టేషన్‌ ను అట్టహాసంగా ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణమధ్యరైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే బుధవారం రోజు అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు.

మొత్తం మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులను సంకల్పించగా.. మొదటిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పనులు జరుగుతున్న తీరును దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు దక్షిణ మధ్య రైల్వే కేంద్రస్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో.. విమానాశ్రయం స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఇందుకోసం రూ.715 కోట్లను కేటాయించింది.

రైల్వేస్టేషన్ ఆధునీకరణతోపాటుగా.. స్టేషన్‌కు నలువైపులా రోడ్ల వెడల్పు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిశ్చయించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సుమారు 700 కోట్ల విలువైన పనుల్లో భాగంగా.. అన్ని రకాల సౌకర్యాలతో అద్భుతంగా ఎయిర్ పోర్టు తరహాలో పునర్నిర్మాణం జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.ఓపెన్ ప్లేస్ అయితే నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేది. అయినా, రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతంగా జరుపుతున్నారని అన్నారు.2025 సంవత్సరం ముగిసే సమయానికి ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చర్లపల్లి న్యూ టర్మినల్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.

రైల్వేస్టేషన్ లో 26 లిఫ్టులు.. 38 ఎస్కలేటర్లు.. రిటైల్ షాపులు వంటి అనేక నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లను అనుసంధానం చేసేలా పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మాట ఇస్తే.. నెరవేర్చి తీరుతారని, తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్ ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.2025 సంవత్సరం ముగింపున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితమివ్వనున్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ ను రూ. 350 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కాజీపేట రైల్వేష్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ఘట్ కేసర్ -యాదాద్రికి వెళ్లే MMTS లైన్‌ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కొమురవెల్లిలో కొత్తగా రైల్వేస్టేషన్ ను నిర్మాణం జరిపి, ఫిబ్రవరి నెలలోనే రైల్వేస్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన వందేభారత్ ట్రైన్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని అన్నారు. మరో రెండు ట్రైన్లు కావాలని కేంద్ర రైల్వే మంత్రికి విన్నవించామని కిషన్ రెడ్డి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img