దేవుళ్లును పూజించాలంటే పూలతో పూజ చేస్తాం.. కానీ పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ పండుగ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబం, ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ అనీ.. పూలు, ప్రకృతితో ముడిపడిన పండుగ బతుకమ్మ పండుగ అని ఆయన అన్నారు. ఆనాడు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తమ బాధలను చెప్పుకునేందుకు బతుకమ్మ పాటలుపాడి వారి బాధలు తెలిపేవారని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగ దేశంలో ఎక్కడా ఉండదన్నారు. తెలంగాణకు ఇది ప్రత్యేకమైన పండుగ అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకునే పండుగగా బతుకమ్మకు చర్రిత ఉందని అన్నారు. సమాజంలో మంచి చెడులను చెప్పాలన్నా బతుకమ్మ పాటలు దోహదం చేస్తాయన్నారు. తన తరుపున, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరుపున తెలంగాణ ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Live: Bathukamma Celebrations, Sagar Society, Khairtabad, Secunderabad. https://t.co/IUjd3gRQ9D
— G Kishan Reddy (@kishanreddybjp) October 5, 2024