తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటణ ఖరారు అయింది. ఈనెల 12న ఆయన తెలగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ సభ నిర్వహిస్తారని సమాచారం. రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఇతర ముఖ్య కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.