పూలను పూజించే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రముఖ జర్నలిస్ట్ శిగుళ్ళ రాజు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన సాంప్రదాయాలు ఎల్లలు దాటుతూ దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ పండగను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వీరోచిత పోరాటాలకు, నియంతృత్వనికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాల్లో బతుకమ్మ పండుగే స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రంగురంగుల పూలతో గ్రామగ్రామాన సద్దుల బతుకమ్మను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ.. భావితరాలకు మన బతుకమ్మ పండుగను అందించాలని ఆయన ‘X’ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పూలను పూజించే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. వీరోచిత పోరాటాలకు, నియంతృత్వనికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాల్లో బతుకమ్మ పండుగనే స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 💐 #Bathukamma pic.twitter.com/eSo4UZyoZB
— Raju Journalist (@ShigullaRaju) October 9, 2024