జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం చెరువుల పరిరక్షణను హైడ్రా ద్వారా బృహత్తర బాధ్యతగా తీసుకున్నామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రకృతి వనరులను కాపాడకపోతే అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్ తరాల మనుగడ సురక్షితంగా ఉండాలంటే ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత ప్రేరణతో శ్రీకృష్ణుడు మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మ రక్షణగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను… pic.twitter.com/hSgQGgZGzx
— Telangana CMO (@TelanganaCMO) August 25, 2024