ప్రజా భవన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఈసమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది. ముఖ్యమంత్రుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్టీసీ, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో హైదరాబాద్ లో నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు సమావేశమై విభజన సమస్యలపై కూలంకషంగా చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాలకు ఉభయతారకంగా ఈ చర్చలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. pic.twitter.com/1Rqc4lDg74
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 6, 2024