...

Hit and run Law: లారీ డ్రైవర్లకు మంత్రి పొన్నం విజ్ఞప్తి.. కొత్త సెక్షన్ ఇప్పుడు అమలు కాదు

కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలోని 106(2) హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్ ని ఇప్పట్లో అమలు చేయమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సెక్రెటరీలు ప్రకటించారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒకవేళ భవిష్యత్ లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్స్ & లారీ ఓనర్స్ ని పిలిచి మాట్లాడతామని ఆ తరువాతనే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ భల్లా ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నారన్నారు. కాని కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుండి లారీ ల సమ్మె చేయాలని భావిస్తున్నారని.. సమ్మెని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన అన్నారు. ఇది సరైంది కాదని కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని పొన్నం ప్రభాకర్ అన్నారు.

లారీ డ్రైవర్లు సమ్మె పై పునరలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. లారీ డ్రైవర్లు సమ్మె చేయవద్దని, సమ్మె లోకి వెళ్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. వెంటనే సమ్మె పై పునరలోచించాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేయడం లేదని ఇది అందరికి కాకుండా.. ప్రమాదం జరిగిన తరువాత హిట్ అండ్ రన్ కి పాల్పడే వారికి మాత్రమే వర్తిస్తుందని రవాణా శాఖ అధికారులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ తో పలు సంఘాలు డ్రైవర్స్ యూనియన్స్ కి అవగహన కల్పిస్తున్నాయి. సమ్మె లోకి కొన్ని డ్రైవర్ సంఘాలు మాత్రమే వెళ్తున్నాయని దానిని లారీ సంఘాల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నాయన్నారు. భవిష్యత్ లో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం లారీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్లను పిలిచి మాట్లాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Share the post

Hot this week

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి...

BJP Membership Drive: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership...

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాగుల వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి సీతక్క

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా అప్రమత్తంగా...

Ponnam Prabhakar: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనీ మంత్రి పొన్నం ప్రభాకర్...

Topics

TUWJ: టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శిగా కల్కూరి రాములు

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి...

అర్ధరాత్రి వరద సహాయక చర్యలను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల...

Rains: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాాద్ లో సోమవారం స్కూళ్లకు సెలవు

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నందున వాతావరణ...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.