మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం, ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్వయంగా బస్సు ఎక్కి వివరాలు తెలుసుసుకున్నారు. నందిగామ నుండి షాద్ నగర్ వరకు ఆయన ప్రయాణం చేశారు. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసి లో ఉచిత ప్రయాణం , 10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ, 500 కే గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇదే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రయాణికులతో తెలిపారు.
బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసి కండక్టర్ తమ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు బాండ్స్ అమలు చేస్తున్నామని త్వరలోనే పీఆర్సీ అమలుకు చర్చిస్తున్నమని, ఆర్టీసిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి పోన్నం పేర్కొన్నారు.