టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి రేవంత్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా, వివిధ పార్టీలకు చెందిన నియోజకవర్గాల నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.