Home Guard Ravinder: అసెంబ్లీలో హోంగార్డులకు సీఎం ఇచ్చిన హామీకే దిక్కులేదు.. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి బాండెడ్ లేబర్ కంటే ఆధ్వాహ్నంగా తయారైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి నుండి వార్డు కౌన్సిలర్ దాకా బందోబస్తు కావాలంటే హోంగార్డు కావాలని అన్నారు. హోంగార్డులు తమ కుటుంబాలను పట్టించుకోకుండా ఎస్సై నుంచి ముఖ్యమంత్రి వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంటే వారిని సమస్యలను పరిష్కారించాలనే సోయి ఏఒక్కరికి లేకపోవడం బాధాకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారులు, తోటి సిబ్బంది వేధింపులతో హోంగార్డు రవీందర్ అత్మహత్యకు పాల్పడటం విషాదాన్ని కలిగిచిందని అన్నారు. రవీందర్ భార్య సంధ్య, పిల్లలు మనీశ్‌ (16), కౌశిక్‌ (13) వీరికి దిక్కెవరని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత జరిగినా ఏ ఒక్క మంత్రిగాని, అధికారిని స్పందిచకపోవడం మరింత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రవీందర్ ది అత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక హోంగార్డు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం చాలా బాధాకమని, దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు, గిడ్డంగులు, జెన్కో , బీఎస్ఎన్ఎల్, ఆర్టీసీ, ఫైర్ శాఖలతో పాటుగా కలెక్టరేట్, కోర్టు భవనాలలో, ఇలా ప్రతీచోటా మనకు ఎదురయ్యే వ్యక్తి హోంగార్డు అని అన్నారు. రాష్ట్రంలో 20,000 మంది హోంగార్డులు కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా, సమయాన్ని చూసుకోకుండా బాధ్యతయుతంగా విధులు నిర్వహిస్తుంటే వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు, సకాలంలో వేతనాలు అందకపోవడం వంటివి బహుమానంగా దక్కుతున్నాయని రేవంత్ లేఖలో తెలిపారు.

2017లో అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానన్న హామీకి దిక్కు లేకుండా పోయిందని… ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే విలువ లేకుంటే రాష్ట్రంలో పాలన ఉన్నట్లా.. లేనట్లా.. అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు,అవుట్ సోర్సిగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినప్పుడు, వీరిని చెస్తే వచ్చే నష్టం ఏమిటి? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హోంగార్డులను పర్మినెంట్‌ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలంటూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ హోంగార్డు నాగమణి చేసిన వీడియో వైరల్‌ అవుతుందని.. అది చూసి అయినా మీలో (సీఎం కేసీఆర్) మార్పు రావాలని… ఇకనైనా హోంగార్డుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని… లేని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ రాశారు.

Share the post

Hot this week

‘రెడ్ ఫ్లవర్’ సినిమా కోసం హంగేరియన్ ఆర్కెస్ట్రా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

‘రెడ్‌ఫ్లవర్’ (Redflower) సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా...

నటి కాదంబరి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వానికి...

ఫార్మా సిటీ ప్రాజెక్ట్ ను కొనసాగిస్తున్నారా? లేదా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

హైదరాబాద్ లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా?...

డిప్యూటీ సీఎం భట్టికి అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల...

రేపే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

తెలంగాణ సచివాల‌యం ముందు దివంగ‌త మాజీ ప్ర‌ధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని...

Topics

Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షునిగా బొమ్మ మహేశ్‌ కుమార్‌...

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన.. రెండు రోజుల్లో రాజీనామా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు....

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీలో కొనసాగుతున్న బోట్ల వెలికితీత పనులు

ప్రకాశం బ్యారేజ్‌ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు పనులు నిరాటంకంగా...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img