కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని కసరత్తు చేస్తున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ కంటే బీసీ లకు ఎక్కువ సీట్లు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీసీలు పార్టీకి పీసీసీ ఛీఫ్ లుగా చేసారు. కానీ, ఒక్కరైనా బీఆర్ఎస్ కు అధ్యక్షుడు అయ్యారా? అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కేసీఆర్ పై నమ్మకం లేకనే కోర్టుకు వెళ్లింది. కోర్టు జోక్యం వల్లనే కవిత అరెస్ట్ ఆగిపోయిందని రేవంత్ అన్నారు.
సీఈసీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేవలం ఆంధ్రకు మాత్రమే పరిమితం కాదన్నారు. చంద్రబాబు అంత అనుభవం ఉన్నవాల్లు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో అమెరికా వైట్ హౌస్ ముందు కూడా ధర్నా చేశామని.. ఇప్పుడు ఆంద్ర వాళ్లు ఇక్కడ ధర్నాలు చేయొద్దని మంత్రి కేటీఆర్ అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నాడని అన్నారు. వారి పార్టీ పేరుపై వారికే క్లారిటీ లేదని.. ఓసారి టీఆర్ఎస్ అని, మరోసారి బీఆర్ఎస్ అని కేటీఆర్ అంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు తీసుకుంటుంన్న30% కమీషన్ కంట్రోల్ చేస్తే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సమర్దవంతంగా అమలు చేయవచ్చన్నారు. రేపు మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్ లో చేరుతారని రేవంత్ స్పష్టం చేశారు. మైనంపల్లి ఫ్యామిలీ కి రెండు టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసిందని తెలిపారు. త్వరలోనే పార్టీ బస్సు యాత్ర ఉంటుందని, తేదీలను పార్టీలో చర్చించి చెప్తామని అన్నారు. తమ సర్వే లలో బీఆర్ఎస్ పార్టీకి ఈసారి 25 సీట్లు దాటవని తేలిందని అన్నారు. బీజేపీ, ఎంఐఎం లు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయని రేవంత్ అన్నారు.