గణేశ్ ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత: రాచకొండ సీపీ సుధీర్ బాబు

త్వరలో ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు, రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసిపిలు మరియు ఇతర అధికారులతో నెరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో బుదవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో జరుపుకొనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన వినాయక చవితి వేడుకలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా అవాంఛిత సంఘటనలకు తావులేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని అధికారులకు కమీషనర్ సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో అధికారులు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలని, ఆయా ప్రాంతాల్లోని పౌరవిభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, వైద్యశాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా సజావుగా జరుపుకునేలా చూడాలన్నారు.

నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీపీ గారు సూచించారు. ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. డయల్ 100 కాల్స్ కు సత్వరమే స్పందించాలని, సీసీటీవీలను విస్తృతంగా వినియోగించాలని, విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు. గణేష్ మండపంలో రోజంతా కనీసం ఇద్దరు వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలని, భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యతగల వైర్లను ఉపయోగించేలా చోరవ తీసుకొవాలని, గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొవాలని ఆదేశించారు.

ప్రతీ గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని తెలిపారు. వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని.. సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ప్రజలు గణేశ్ ఉత్సవాలను ఘనంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియా తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామని, తప్పుడు వదంతులు వ్యాప్తిచేసే వారిమీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గణేష్‌ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల స‌మ‌న్వ‌యంతో నిమ‌జ్జ‌నాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

నిమజ్జనం సందర్భంగా GHMC అధికారుల సమన్వయంతో ముందుగానే చెరువులు, ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు, విద్యుత్‌ లైట్లను, బారికేడ్లను నిర్మించాలని, మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలన్నారు. ప్రజలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతు పనులు, శానిటైజేషన్ పనులను చేపట్టాలన్నారు. గణేష్ వేడుకలను నిర్విఘ్నంగా, ఘనంగా, గౌరవప్రదంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భద్రతాపరంగా పోలీసులు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ సమావేశంలో డిసిపి మల్కాజిగిరి పద్మజ, డిసిపి ఎల్ బి నగర్ ప్రవీణ్ కుమార్, డిసిపి యాదాద్రి రాజేష్ చంద్ర , డిసిపి మహేశ్వరం సునీత రెడ్డి, డిసిపి ఎస్బి కరుణాకర్, డిసిపి క్రైం అరవింద్ బాబు, ఎస్వోటీ డిసిపిలు రమణ రెడ్డి, మురళీధర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share the post

Hot this week

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు,...

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ 50 వేల విరాళం

తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు...

ఉద్యోగులకు వరంగా మారనున్న EHS కొత్త ప్ర‌తిపాద‌న‌: ల‌చ్చిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షన‌ర్లు, వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ‌ స‌భ్యుల కోసం...

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి...

గణేష్ నిమజ్జనం విజయవంతం: GHMC కమీషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

Topics

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకు ప్రతిపాదనలు,...

సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ 50 వేల విరాళం

తెలంగాణలో ఇటీవల వరదల వల్ల కొంతమంది నిరాశ్రయులయ్యారు. చాలా వరకు రైతులు...

ఉద్యోగులకు వరంగా మారనున్న EHS కొత్త ప్ర‌తిపాద‌న‌: ల‌చ్చిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఫెన్షన‌ర్లు, వారిపై ఆధార‌ప‌డ్డ కుటుంబ‌ స‌భ్యుల కోసం...

ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూప‌ల్లి.. వైద్యులపై ఆగ్రహం

కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖామంత్రి జూప‌ల్లి...

గణేష్ నిమజ్జనం విజయవంతం: GHMC కమీషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లోగా కూల్చేయండి: హైకోర్టు

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అనుమతులు లేకుండా నిర్మించిన...

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ పుట్టినరోజు వేడుకలు

సీనియర్ జర్నలిస్ట్, టీవీ5 సీనియర్ రిపోర్టర్ నోముల రవికుమార్ పుట్టినరోజు వేడుకలు...

ఒవైసీకి భయపడి విమోచన దినోత్సవం జరపకపోవడం సిగ్గు చేటు: బండి సంజయ్

"మావల్లే తెలంగాణ వచ్చింది. మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img