కులవృత్తులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమే… రెండో విడత గొర్రెల పంపిణీలోమంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికీ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణలో కురుమ, యాదవుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్నిదేశమంతా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని జైనల్లీపూర్, కోడూరు, మాచన్ పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 18 యూనిట్ల గొర్రెలను అందించారు.

tiger 3261166 1280 1

ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కులవృత్తులను ఆదుకున్నది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి అన్నారు. అన్నికులవృత్తులను ప్రోత్సహించి, కుల వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకవచ్చి స్థానికంగా విక్రయించే వారని అన్నారు. ఉచిత గొర్రెల పంపిణీ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత స్థానికంగానే గొర్రెల పశు సంపద భారీగా పెరిగిందని అన్నారు. కురుమ, యాదవుల జీవితాల్లో కేసీఆర్ గొప్ప మార్పును తీసుకువచ్చారని అన్నారు.

8855d537 d4b4 4f67 ab7a c19635ff59f6 1

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాలలోని పేదలకు కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అందించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత 24 గంటల విద్యుత్తు, తదితర పథకాలతో సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారంతా ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించాలని కోరారు. గతానికి నేటికీ తేడాను గమనించాలని మంత్రి అన్నారు. సంక్షేమ పథకాలు అంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటే ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నేతలు ఈ పథకాలను ఎలాగైనా తీసివేయాలనే కుట్రతో ప్రజల మద్య విద్వేషాలు రాజేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అభివృద్ధి విఘాతకుల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

1212
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img