కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ప్రభుత్వ చిత్త శుద్దిని తెలియజేస్తుందని బీజేపీ మహిళా నేతలు అన్నారు. బేజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహంచిన మీడియా సమావేశంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళిక కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని తెలిపారు. మహిళలకు అండగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జూలై 9న ధర్నాకార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
Telangana Mahila Morcha Dharna at Indira Park Dharna chowk on 9th July 9 am on the false promises given to women by Telangana Congress government @BJP4Telangana @chshekharbjp @blsanthosh @VanathiBJP @BJPMahilaMorcha pic.twitter.com/F64ENaa3Y6
— Dr Shilpa Reddy (@DrShilpa4Bjp) July 7, 2024