హైదరాబాదులోని ఒక పెళ్లి రిసెప్షన్ లో పెళ్ళికొడుకు వాళ్లు అతిధులకి తాటి ముంజలు ఏర్పాటు చేశారు. తాటి ముంజలను రిసెప్షన్ లో ఉంచడంతో అక్కడికి వచ్చిన అతిధులు ఆశ్చర్యంతో ఆరగించారు. మిగిలిన పదార్థాల కంటే వీటినే ఎక్కువ మంది ఇష్టపడ్డారు. మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్ః లో జరిగింది. తాటి ముంజల్లో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ జింక్ తోపాటు విటమిన్లు, ఫైబర్ వంటివి కూడా ఉంటాయి. వేసవిలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.