నిన్న తీవ్ర అస్వస్థతకు గురై, AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తమ్మినేని గుండె, కడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ట్రీట్మెంట్ కు ఆయన సహకరిస్తున్నారని, కొద్దిగా ఆరోగ్యం కుదుటపడిన వెంటనే వెంటిలేటర్ తొలగిస్తామని వైద్యులు వెల్లడించారు.
Thammineni: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం
RELATED ARTICLES