తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌పై టీజీపీఎస్సీ (TGPSC) క్లారిటి ఇచ్చింది. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తూ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు 1:100 ప్రకారం ఎంపికచేయాలని అభ్యర్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థుల డిమాండ్ ను పరిశీలించిన టీజీపీఎస్సీ కమిషన్ 1:100 నిష్పత్తిలో అభ్యర్ధల ఎంపిక సాధ్యం కాదని అభ్యర్ధులకు టీజీపీఎస్సీ తేల్చిచెప్పింది.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు, వారి రక్వెస్ట్ ను పరిశీలించాలని కమీషన్ కు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. పరిశీలించిన కమీషన్ 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని, వారి రిక్వెస్ట్ ను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.