NewsTelanganaతెలంగాణ నూతన స్పోర్ట్స్ పాల‌సీ నవంబర్ 2024 లోపు సిద్దం: సీఎం

తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాల‌సీ నవంబర్ 2024 లోపు సిద్దం: సీఎం

-

- Advertisment -spot_img

తెలంగాణ ప్రభుత్వం రూపొందించే “తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాల‌సీ” (Telangana New Sports Policy) దేశంలోనే అత్యుత్త‌మ పాల‌సీగా ఉండాల‌ని, అందుకు విస్తృత అధ్య‌య‌నం, నిపుణులు, క్రీడాకారుల‌తో విస్తృత స్థాయిలో సంప‌ద్రింపులు చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడాపాల‌సీపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. క్రీడా పాలసీపై తుది ముసాయిదా (ఫైన‌ల్ డ్రాఫ్ట్‌)ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వ‌న‌రుల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకోవాల‌ని, ఇప్ప‌టికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల‌ను ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

దేశంలోనే తెలంగాణ నూతన స్పోర్ట్స్ పాల‌సీ అత్యుత్త‌మం

యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి సంబంధించిన బిల్లు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా రూపొందించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీలో భాగ‌మైన యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడ‌మీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు (SATG) సంబంధించి ప‌లు వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. అందులో చేయాల్సిన మార్పులుచేర్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీ దేశంలోనే అత్యుత్త‌మంగా ఉండాల‌ని సీఎం ఆకాంక్షించారు. త‌న ద‌క్షిణ కొరియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అక్క‌డి కొరియా నేష‌న‌ల్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీని సంద‌ర్శించిన సంద‌ర్భంగా గుర్తించిన అంశాలను ముఖ్య‌మంత్రి తెలియ‌జేశారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

Also Read | ‘ప్రగతిపథంలో ప్రజాపాలన’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్ర‌పంచంలోనే అత్యుత్తమైన‌దిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అన‌స‌రిస్తున్న విధానాల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. మ‌రో ప‌ది రోజుల్లోనే స్పోర్ట్స్ పాల‌సీకి సంబంధించిన గ‌వ‌ర్నింగ్ బాడీని ఖ‌రారు చేయాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్ ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో నేష‌న‌ల్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ను సంప్రదించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (క్రీడ‌లు) ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ శివ‌సేనా రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి షాన‌వాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

అనుపమ పరమేశ్వరన్ ‘పరాదా’ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు !

అనుపమ పరమేశ్వరన్ 'పరాదా' మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తార, ప్రస్తుతం మలయాళంలో రూపొందుతున్న 'పరాదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు...

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...
- Advertisement -spot_imgspot_img

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you