SSC RESULTS : తెలంగాణ ఎస్సెస్సీ ఫలితాలు విడుదల
తెలంగాణలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను హైదరాబాద్ లో మంగళవారం ఉదయం 11ః00 గం.కు విడుదల చేశారు. రాష్ట్రంలో 91.31% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠలలు 100% ఉత్తీర్ణత సాదించాయి. ఫలితాల్లో 99.09% తో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 65.10% తో వికారాబాద్ చివరి ప్లేస్ లో నిలిచింది. మెత్తం మీద ఈ ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీనుండి 13వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి 12.30 వరకు జరుగుతాయని అదికారులు వెల్లడించారు.